![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -240 లో......గంగ తన గదిలో కూర్చొని అమ్మ కాళ్ళు నొప్పులు అని ఇబ్బంది పడుతుంది అప్పుడే రుద్ర వచ్చి తనతో మాట్లాడుతాడు. త్వరలో బాక్సింగ్ పోటీ ఉంది. నువ్వు ఎలాగైనా అందులో గెలవాలి. ఆ విశ్వనాథ్ ట్రైన్ చేస్తున్న అబ్బాయి ధీరజ్ ని చూసావ్ కదా.. ఎలా ఉన్నాడోనని రుద్ర అంటాడు. కొబ్బరికాయనే కొట్టలేని వాడు ఎలా గెలుస్తాడని గంగ అంటుంది. అయిన ఆ విశ్వనాథ్ గారి మాటల్లో అర్ధం అయింది ఏంటంటే.. ఆడవాళ్లు వంటింటికి తప్ప దేనికి పనికి రారు అని అనుకుంటున్నాడని గంగ అంటుంది. అవును నాక్కూడా అలాగే అనిపించింది.. మేల్ ఇగో అని రుద్ర అంటాడు.
కానీ వాళ్ళ భార్య నాకు చాలా నచ్చింది బాగా మాట్లాడిందని గంగ అంటుంది. మరొకవైపు సుధా కూడా గంగ గురించి ఆలోచిస్తూ విశ్వ నాథ్ కి చెప్తుంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది చాలా మంచి అమ్మాయి అని చెప్తుంది. దాంతో విశ్వ నాథ్ చిరాకుపడతాడు. ఆ తర్వాత వీరుని రుద్ర కొట్టినట్లు.. ప్రీతీకి కల వస్తుంది. దాంతో ఒక్కసారిగా ఉల్లిక్కిపడి నిద్రలేచి భయపడుతుంది. ఏమైందని శకుంతల వస్తుంది. రుద్ర అన్నయ్య మా ఆయనని చంపేసినట్లు కల వచ్చిందని ప్రీతీ అనగానే వీరు, శకుంతల షాక్ అవుతారు. అవేం పట్టించుకోకని వీరు అంటాడు. అలా వాళ్ళ ముందు అంటాడు కానీ తనకి వీరుకి కూడా టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. ప్రమీల భోజనం చేసి సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే నేను వస్తానని గంగ అనగానే వద్దు మీరు వెళ్తే నాకు ఇంట్లో బోర్ కొడుతుందని పెద్దసారు అంటాడు. కానీ సూపర్ మార్కెట్ కి వెళ్లి ఆ ప్రమీల, కార్తీక్ ని దగ్గర చెయ్యాలి అని గంగతో రంగా అనగానే గంగ వెళదామని అంటుంది.
ఆ తర్వాత ప్రీతీకి కల వచ్చిందని తను భయపడిందని రుద్రకి తెలిసి ప్రీతీ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. నేను నిన్ను ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు చెయ్యనని రుద్ర అంటాడు. వీరూలోని మృగాన్ని చంపేసి మంచివాడిని చెయ్యాలని రుద్ర మనసులో అనుకుంటాడు. మరొకవైపు ప్రీతీకి వచ్చిన కలని అడ్డుపెట్టుకొని రుద్రని ఇంకా బ్యాడ్ చెయ్యడానికి శకుంతల దగ్గరికి వెళ్లి వీరు మాట్లాడుతాడు. రుద్ర బావ నన్నెందుకు చంపుతాడు అత్తయ్య.. వాళ్ళ ఆస్తులు లాక్కుంటానని కోపమా కొంపదీసి మీరు రుద్ర బావని ఇంటికి దూరంగా పంపించరు కదా అని వీరు మాట్లాడతాడు. శకుంతలకి లేని ఆలోచనని క్రియేట్ చెప్తాడు వీరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |